Saturday, October 18, 2008

పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- 1

పరిటాల రవన్న జీవిత పొరాటాల చరిత్ర:

విరామమేరుగాని ఒక ఉద్యమకారుని ఊపిరి యాత్ర ,
ఒక అవిశ్రాంత పోరాట యోధుని జీవిత చరిత్ర ,
అసహాయుల హహకారాల మధ్య పూరించిన ఒక సాహసవీరుని సమరశంఖ నాదం,
అన్యాయం,అక్రమాలు,దోపిడి,దౌర్జన్యాలను ప్రతిఘటించిన ఒక సముజ్వల ప్రచండ తేజం,
అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఇదే పరిటాల రవీంద్ర హృదయ ప్రాంగణం.
సవినయంగా అందరికి పలుకుతోంది స్వాగతం ! !


పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న ని రాయలసీమ లోని అన్ని జిల్లాలలొ ఒక దేవుడుగా కొలుస్తారంటే అతిశయొక్తి కాదేమో.5 సార్లు అనంతపుర్ జిల్లా లొని పెనుకొండ నియొజకవర్గానికి M.L.A గా ప్రాతినిద్యం వహించారు.రవన్న పెనుకొండ నియొజకవర్గములొని వెంకటాపురం గ్రామములొ 28-5-1957 న జన్మించారు.రవన్న తండ్రి గారు శ్రీరాములు(12/4/1935 - 29/11/1982) 300 ఎకరాల భూసామి తన భూమినంతా కమ్యునిస్ట్ సిద్దంతాల ప్రేరణ తొ పేదలకు(బొయా,కురుబ,ఈడిగ కులస్తులు) పంచిపెట్టారు.పేద ప్రజల భూములు(సివైజామ భూములు) కనగానపల్లి, చెన్నెకొత్తపల్లి భూస్వాములు ఆక్రమించుకొన్నారు.ఆ భూస్వాములే గంగుల నారాయణరెడ్డి,సానే చెన్నా రెడ్డి.వారి నుంచి 600 ఎకరాలు బడుగు బలహీన వర్గాలకు పొందెటట్టు పొరాటం చేసి వారికి సాధించి పెట్టారు. 1971 లొ సిపీఇ(ఎం.ఎల్) పార్టి లొ చేరి అనతి కాలంలొనే వుద్యమ నాయకుదుగా గుర్తింపు పొందారు. ఈ భూముల పంపకం వరస హత్యలకు మరియు కుల పొరాటాలకు శ్రీకారం చుట్టింది(ఈనాడు:25/01/2005 మరియు 06/02/2005 పేపర్ చూడండి).29/05/1975 న శ్రీరాములు అనుంగు సహచరుడుతొ గంగుల నారాయణ రెడ్డి, సానే చెన్నా రెడ్డి చంపించారు.
రవన్న అన్న హరన్న(పరిటాల హరింద్ర) తండ్రి అడుగుజాడల లొనే పేదలకు చేరువ అయ్యాడు.ఇది సహించలేని గంగుల నారాయణరెడ్డి,సానే చెన్నారెడ్డి కబీర్ అనే ఇనస్పెక్టర్ తొ ఎనెకౌంటర్ చెయించటానికి పతకం సిద్దం చేసారు.పొలిసులు వల పన్ని హరన్నను వెంకటాపురం లొని ఇంట్లొ పట్టుకొని,దగ్గిర్లొని నసనకొట గ్రామ నడిబొడ్డులొ వందల మంది చూస్తుండగా 28/11/1982 న ఎనెకౌంటర్ చేశారు.నక్సలైట్లు 1982-1983 కాలములొ గంగుల నారాయణ రెడ్డి, నరసన్న, యాది రెడ్డి లను చంపేశారు.కాని ప్రత్యర్థులు ప్రతీకారంతొ రవన్న చేయించాడని అనుకొంటారు.రవన్న తన మేనమామ కొండన్న సాయముతొ 1991 వరకు అఘ్నాతం లొనే వున్నడు.నారాయణ రెడ్డి ని నక్సలైట్లు అనతపురం లాడ్గి లొ వుండగా చంపెస్తారు.
నారాయణ రెడ్డి చనిపొయిన తేరువాత, 1982 మరియు 1985 లొ పెనుగొండ M.L.A గా తేలుగుదేశం పార్టి తరుపున రామచంద్రా రెడ్డి గెలిచాడు.1989 ఎలక్షన్లలొ పెనుగొండ నియొజకవర్గం సానే చెన్నారెడ్డి వశమయింది.అప్పుడు కాంగ్రెస్ గవెర్నమెంట్ ని ఏర్పరిచింది.అప్పుడు సానే చెన్నారెడ్డి కొడుకులు రమణారెడ్డి,ఒబులరెడ్డి మరియు గంగుల నారాయణరెడ్డి కొడుకు గంగుల సూర్య నారాయణరెడ్డి హత్యలతొ అరాచకాలతొ మానభంగాలతొ అనంతపురం జిల్లా అట్టుడికిపొయింది.ఇప్పటికీ ధర్మవరం చుట్టుపక్కల ప్రజలు వీరి అరాచకాలను కథలు కథలు గా చెప్పుకొంటారు.అప్పట్లొనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంది టిడిపి కార్యకర్తలను పొట్టన పెట్టుకొంది.వుదాహరణగా,ఈ ఒబులరెడ్డి ముస్కీన్ అనే మైనారిటి తెలుగుదేశం కార్యకర్తను రోజుకొక కిలొ మాంసం అతని శరీరం నుంచి వేరు చేసి అతి క్రూరంగా చంపేసాడని అక్కడి ప్రజలు చెప్పుకుంటారు.ఈ గంగుల సూర్యనారాయణరెడ్డి మద్దెలచెర్వు గ్రామములొ ఒక కురుబ(BC Caste) యువతి ని మరియు ఒక ప్రభుత్వొద్యొగి ని వారి తల్లిదండ్రుల ఎదుటే మానభంగం చేసాడంటారు.

source: katta-butchibabu.blogspot.com


http://www.paritalaravi.com/ravi.html

Click on the above link for complete History of Ravanna.

Thursday, October 16, 2008

Punch Lines From NBK

వూహాజనితమైన ఈ ఇంటెర్వ్యు ని ఎవరూ అపార్థం చేసుకొవద్దని మనవి.
బాలయ్య తొ ముఖాముఖి:

విలేఖరి: చంద్రబాబు గారి ఆశయాలు నచ్చి మీరు పూర్థి స్తాయి లొ రాజకీయాల లొకి వచ్చారా లేక కొత్త పార్టి వచ్చింది కాబట్టి మీరు రావల్సి వచ్చిందా?
బాలయ్య:మా నాన్న గారు స్తాపించిన తెలుగుదేశం పార్టి కి పూర్వ వైభవాన్ని తీసుకు రావల్సిన అవసరం వుంది,అందుకే వచ్చాను.

విలేఖరి: చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, సిద్దాంతాల గురించి మీ అవగాహన తెలపగలరా?

బాలయ్య: ఆయన సిద్దాంతాలు,ఆశయాలు సామన్యుడికి ఆర్థికంగా బలపడటానికి వుపయోగపడ్డాయి, భవిష్యత్తులో మరింత వుపయోగపడతాయి.

విలేఖరి:మీ రాజకీయ ప్రవేశం చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి ని చేయుటకా లేక మీ అభిమానులు కొరుకున్నట్లుగా మీరు ముఖ్యమంత్రి అవటానికా?

బాలయ్య: ఫ్రస్తుతం మా నాన్న గారు స్తాపించిన తెలుగుదేశం పార్టి ని గెలిపించి,చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ని చేయుటమే మా నందమురి వంశాభిమానుల మరియు తెలుగుదేశం పార్టి కార్యకర్తల ప్రధాన లక్ష్యం.

విలేఖరి:మీ అభిమానులు కాని, మీ కుటుంబములొని వారు కాని మీరు ముఖ్యమంత్రి కావాలని కొరుకుంటున్నారు.అంటే ముఖ్యమంత్రి గా చంద్రబాబు గారు వారికి ఇష్టం లేదని దాని అర్థమా?

బాలయ్య:కాదు, భవిష్యత్తులొ నేను ముఖ్యమంత్రి ని అవ్వాలని వారి కొరిక.

విలేఖరి:తెలుగు యువత కార్యకర్తలు చంద్రబాబు ని ముఖ్యమంత్రి ని చెయ్యాలని పిలుపునిస్తున్నారు.మరొ పక్క మీ అభిమానులు మిమ్మల్ని ముఖ్యమంత్రి గా చూడాలని అంటున్నారు.ఈ రెంటి మధ్య సమన్వయం కొసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎమిటి?

బాలయ్య:మా మధ్య భిన్నాభిప్రాయాలు లేకుండా సమన్వయంతొ తెలుగుదెశం పార్టి ఘన విజయానికి మా వంతు క్రుషి చేస్తాము.

విలేఖరి:గతంలొ మీపై వున్న కాల్పుల అభియోగం పై మీ విమర్శకులకు మీరిచ్చే సమాధానం?

బాలయ్య:అప్పట్లొనే కొర్ట్ నన్ను నిర్దొషి గా గుర్తించింది,ఇంక నేను కొత్తగా సమాధానం చెప్పెదేముంది.
విలేఖరి:మీరు మీ సినిమాలలొ పంచె కట్టు ట్రెండ్ శ్రుష్టించారు,అలాగె Faction ట్రెండ్ శ్రుష్టించారు.రాజకీయాలలొ కూడ ట్రెండ్ శ్రుష్టిస్తారా?

బాలయ్య:మీరే చూస్తారుగా ఎమి జరుగుతుందో.

Monday, October 13, 2008

Tiger - NTR

పులి ని చూసి నక్క వాతలు పెట్టుకొకూడదు

Sample Images of Anna NTR


పైన చిత్రములొ ఎరుపు వ్రుత్తకారములొ మన అన్న NTR