Friday, October 31, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 5


యువగర్జన విశేషాలు:

  • గన్నవరం నుండి చిలకలూరిపేట వరకు 6 అడుగుల ఎత్తులొ వున్న 20వేల జండాలతో అంతా పసుపు మయం.

  • యువగర్జన ప్రాంగణం లొ సభ జరిగేటప్పుడు హెలికాఫ్టర్ ద్వారా పూలు చల్లటం.

  • లక్ష పసుపు రంగు బెలూన్లు ప్రాంగణం నలుమూలల నుంచి ఎగురవేస్తారు.

  • 8 భారీ కటౌట్లు, 30 స్వాగత ద్వారాలు,10 పెద్ద బెలూన్ల ఏర్పాటు.

  • ఫిరంగిపురం మండలం లొని వేములూరిపాడు నుంచి 7గుర్రాల రథం పై యువజ్యొతి NTR ప్రాంగణం చేరుకుని ఆ జ్యొతి ని బాలయ్య చెతుల మీదుగా చంద్రబాబు నాయుడు గార్కి అందించటం.

  • వేదిక పై భాగాన ఎనుగు దంత ఆకారం లొ తోరణాలు, వేదిక మీద అటూ ఇటూ సిం హాల ప్రతిమలు.

  • విజయవాడ, గుంటూరు నగరాలలో ఎటు చూసినా భరీ కటౌట్లు, స్వాగత ద్వారాలు, ఫ్లెక్సి లు.

  • 5 వ జాతీయ రహదారి 100 కి.మీ మేర పసుపుమయం.

  • ప్రతీ గ్రామం లొ ఇప్పుడు చూస్తున్న యుగర్జన సంబరాలతో సభా ప్రాంగణానికి విచ్చేసే జనం 15 లక్షల పై మాటే నని అంచనా.

Wednesday, October 29, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 6








యువగర్జన దగ్గిర పడుతున్నకొద్దీ అందరి గుండెల్లొ రైళ్ళు పరిగెడుతున్నాయి.తెలుగుదేశం పార్టి కి వున్న క్యాడర్ ని చూసి ఇప్పుడు వచ్చిన కొత్త పార్టిలకు కాని,కమ్యునిస్టులకు కాని,అధికార పార్టి కాని బెంబేలెత్తుతున్నారు.ఇది స్పష్టంగా వారి మాటల్లొ మనం గమనించవచ్చు.యుగర్జన ఏర్పాట్లు వూపందుకున్నట్టు ఈ పాటికే మీకు తెలిసివుంటుంది.కనీ వినీ ఎరుగని రీతిలొ NTR ప్రాగణం అన్ని హంగులతొ రూపు దిద్దుకుంటుంది. తెలుగుదేశం అధికారం చేపట్టాలని ఇప్పటికే చాలా ప్రాంతాల్లొ పూజలు,యాగాలు తెలుగు యువత నిర్వహిస్తుందని పత్రికలు చాటుతున్నయి.కమ్యునిస్టులు ఎవరి దగ్గిరకు వెళ్ళినా చివరకు తెలుగుదేశం దగ్గిరకు రాక తప్పదు.వారి ఉనికిని కాపాడుకొవటానికి వారికి వున్న ఎకైక మార్గం తెలుగుదెశం మాత్రమే.రాబొయే కాలంలొ అది నిరూపించబడుతుంది. చాలా ప్రాంతాలలొ తెలుగుదెశం కార్యకర్తలు, తెలుగు యువత మరియు నందమూరి అభిమానులు వాహనాల కొరతతొ ఇబ్బంది పదుతున్నారంటే,దీనిని బట్టే ఈ యువగర్జన ఎంతగా విజయవంతమవబొతుందో అర్థమవుతుంది.ఈ ఎలక్షన్స్ లొ ప్రధాన పొటీ తెలుగుదెశం, కాంగ్రెస్ పార్టీ ల మధ్యే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



యువతా మేలుకొ - నీ రాష్ట్రాన్ని అవినీతి నుండి రక్షించుకొ.



స్వర్ణాంధ్ర ని సాధించుకొ - భావితరాలతొ ఆనందాన్ని పంచుకొ.



కపట నాటక నాయకులను ఎదిరించు - గర్వంగా జీవించు.



తెలుగుదెశం పార్టి ని గెలిపించు - నీ కలల స్వర్ణాంధ్ర ని సాధించు

Monday, October 27, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 8


ఈ యువగర్జన సభ వుద్దేశ్యం, బాలయ్య ని తెలుగుదేశం పార్టి తరపున ప్రత్యక్ష రాజకీయాలలొకి ప్రవేశం కల్పించడం.మీడియా వుచ్చులో మరియు వ్యతిరేకుల కుట్రలకు నందమూరి అభిమానులు పడతారనుకొవటం వారి పిచ్చి భ్రమే అవుతుంది.కాబట్టి ఈ యువగర్జన జూనియర్ NTR కొసం నిర్వహిస్తున్న సభ కాదు.తెలుగుదేశం పార్టి లొకి బాలయ్య ను నందమూరి తారకరామారావు గారి వారసుడు గా తెలుగుదేశం పార్టి కార్యకర్తలు, తెలుగు యువత, నందమూరి అభిమానులు యువగర్జన ద్వారా స్వాగతిస్తున్న సభ.