Saturday, October 25, 2008

Yuvagarjana Sambaraalu

తెలుగుదేశం కార్యకర్తలకి బాలయ్య అబిమానులకు విన్నపం:
గుంటూరు, క్రిష్ణా జిల్లాల పరిసర ప్రాంతాలవారు దయచేసి మీ వీడియో కెమెరాలతొ "యువగర్జన" ర్యాలీ ద్రుశ్యాలను చిత్రీకరించి Online లొ అప్ లోడ్ చేయగలరని మనవి చేస్తున్నాము.వాటిని దూర ప్రంతాల లొవున్న మన తెలుగుదేశం కార్యకర్తలు, అబిమానులు చూచి ఆనందించుటకు మీ సహాయము కోరడమైనది.మీడియా వారు కొంత వరకే అందించగలరు.ఇటువంటి సభలు కాని ర్యాలీ లు కాని మునుముందు చూడలేము.ఇప్పటి వరకు మనకు అందుబాటులొ వున్న వీడియో లు TV9,TV5,ETV2 వారి 3 నిముషాల క్లిప్పింగులు.దయచేసి మీ స్నేహితులకి కాని బందువులకు కాని,కార్యకర్తలకు కాని,అభిమానులకు కాని తెలియచెయగలరని మనవి.ర్యాలీలు అంటే నాయకుల ప్రసంగాలు మాత్రమే కాకుండా, జనసందొహాలని, అబిమానుల కొలాహలాన్ని, వివిధ డప్పు వాయిద్య వేషగాళ్ళని,వాహనాలపై వున్న యువకుల ఉత్సాహాన్ని తీయగలరని ఆశిస్తున్నము.
పదిరొజుల ముందు నుంచి వినిపిస్తున్న అబిమానుల గర్జన ను గర్జన సంబరాలను ఈ క్రింది వీడియోలలొ చూడండి.

Friday, October 24, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 9

నరసరావుపేట లొ యువగర్జన సంబరాల ర్యాలీ లొ తెలుగుదెశం కార్యకర్తల, నందమూరి అభిమానుల ఉత్సాహంతొ పాల్గొన్నరు.నవంబర్ 5వ తారీఖు కొసం ఎప్పుడా అని ప్రతి అభిమాని ఎదురు చూస్తున్న సన్నివేశాలు ఎన్నొ ఎన్నెన్నొ.ఇప్పటికే తెలుగుదేశం నేతల తొ యువగర్జన ప్రాంగణం లొ హడావిడి గా వుంది.ఇప్పటికే గుంటూరు నగరంలొ బాలయ్య భారీ ఫ్లెక్స్ ఏర్పాటు చేసారు.


గుంటూరు లొ మొదలైన యువగర్జన సంబరాలు

గుంటూరు లొ తెలుగు యువత మరియు నందమూరి అభిమానులు సమైక్యంగా యువగర్జన ప్రారంభ సంబరాలు జరుపుకున్నారు. యువగర్జనను రాబొయే ఎన్నికలకు రణ గర్జనగా తెలుగుదేశం పార్టి భావిస్తుంది.1994 ఎన్నికలకు అన్న NTR "సిం హ గర్జన" సభ తొ అధికారాన్ని కైవసం చెసుకుంది.అదే తరహా లొ ఈ "యువగర్జన " సభ తొ తిరిగి తెలుగుదేశం పార్టి అధికారాన్ని కైవసం చేసుకొవటం ఖాయమని అనుభవఘ్నులు,రాజకీయ మేధావులు విస్వసిస్తున్నారు.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియో క్లిప్పింగులను చూసి ఆనందించండి. 2009 లొ తెలుగుదేశం పార్టి గెలుపుకై మీ వంతు క్రుషి చెయ్యండి.




Thursday, October 23, 2008

యువగర్జన - కౌంట్ డౌన్ 10




అధికారంలోకి రాగానే లక్షలాది ఉద్యొగాలు ఇస్తానన్న రాజశేఖరరెడ్డి అందలం ఎక్కగానే అన్ని హామీలను తుంగలో తొక్కారు.ముఖ్యమంత్రిగా గత నలుగున్నరేళ్ళలొ పోష్టింగుల కన్న ఊష్టింగులే ఎక్కువ చేసారు.ఉద్యొగం లేక, ఊపాధి లేక యువత భవితను రొడ్డు కీడ్చారు. ప్రభుత్వ శాఖల్లొ లక్షలాది ఖాళీలు వున్నా....భర్తీ చేసిన పాపాన పొలేదు.అందుకే ఈ దగాకొరు, బడా చోరు ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు "తెలుగు యువత" ఉద్యమించింది, సమర సిం హం లా,ఉగ్ర నరసిం హులై....ఉక్కు పిడికిలి బిగించింది.అధికార పక్ష గుండెల్లొ అలజడి ని స్రుష్టిస్తు, తెలుగుదేశం పార్టి గుంటూరులో ప్రతిష్టాత్మకంగా "యువ గర్జన" ను నవంబర్ 5వ తేదీన నిర్వహిస్తుంది.చరిత్రను తిరగరాసే ఈ యువగర్జన కు నందమూరి వారసులు...చైతన్య రథ సారధి హరిక్రిష్ణ, డైలాగ్ డైనమైట్ విశ్వ విఖ్యాత నట తేజో రూపం బాలయ్య , ఇంకా కల్యాణ్ రాం,తారక రత్న లు హాజరు కానున్నారు.



Tuesday, October 21, 2008

పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- 3


రవన్న పై ప్రతీకారం తీర్చుకొనుటకు సూరి అదను కొసం చూస్తున్నాడు.1997 లొ తన తండ్రి పరిటాల శ్రీరాములు మీద సినిమా తీయాలని సంకల్పిస్తాడు రవన్న.హైదరాబాదు లొని జుబ్లీ హిల్స్ రామానాయుడు స్టూడియూ లొ ముహూర్తం సన్నివెశం షూటింగ్ పూర్తి అయిన తరువాత తిరుగు ప్రయాణంలొ శక్తివంతమైన Remote Controlled కారు బాంబు ని పేల్చాడు సూరి. ఆ పేలుడు లొ ఈ టీవి నిపుణులతొ సహ 26 మంది మరణించారు.30 మంది గాయపడ్డారు. ఈ పేలుడు లొ భానుకొట కిష్టప్ప మరియు లక్ష్మరెడ్డి(ఇంజనీరింగ్),కుంటిమద్ది శ్రీరాములు, పెరుగు వెంకటెశ్వర్లు, కొండా రెడ్డి తదితరులపై పొలిచులు కేసు నమొదు చేసారు.వీరంతా సూరి సహచరులు.ఈ కేసు పై పొలీసులు తీవ్రంగా క్రుషి చేసి కర్నాటక లొ తల దాచుకున్న సూరి ని పట్టుకుని చర్లపల్లి జైలుకి పంపారు.1999 లొ ఒబులరెడ్డి అన్న రమణారెడ్డి ని హైదరాబాదులొని అతని స్నేహితుడి ఇంట్లొ పార్టి జరుగుతుండగా ROC గ్రూపు కాల్చి చంపారు.రవన్న తిరిగి 1999 ఎలక్షన్స్ లొ ఎటువంటి హింసా,రిగ్గింగులు లేకుండా తెలుగుదేశం పార్టి తరపున గెలుస్తాడు.2000 నుంచి 2004 వరకూ అనతపురం జిల్లా ప్రశాంతముగా వుందని అక్కడి ప్రజలు అనుకొంటారు.జైలు నుంచి పొటీ చెసిన సూరి కి డిపాజిట్లు కూడా రావు.అదే జైలు నుంచి సూరి ఒకసారి వై యెస్ జగన్ తొ కలిసి అనతపురం లొని రవన్న ఇంటిని పేల్చివేయటానికి కుట్ర పన్నుతాడు.ఈ కుట్ర ని పొలీసులకి చెప్పి సూరి మీద జగన్ మీద కేసు పెడతాడు. తరువాత రవన్న ఒక సుముహూర్తాన పేద అవివాహిత జంటలకు వెంకటాపురం లొ వివాహాలు జరిపిస్తాడు.రవన్న అనుచరులు ముగ్గురు కారు లొ వెంకటాపురం వస్తుండగా స్సొరి అనుచరులు దారి కాచి చంపుతారు.2004 ఎన్నికలలొ భానుమతి కి వై యెస్ జగన్ కాంగ్రెస్స్ టిక్కెట్ ఇప్పిస్తాడు.సుదర్శన్ నాయకత్వంలొని రెడ్ స్టార్ నక్షలైట్లు రవన్న ని ఎలక్షన్స్ ప్రచారం లొ చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.ఆ ఎలక్షన్స్ లొ 24000 వొట్ల మెజారిటి తొ రవన్న గెలుస్తాడు.అదే ఎలక్షన్స్ లొ తెలుగుదేశం పరాజయం పాలవుతుంది.
కాంగ్రెస్స్ పార్టి ప్రభుత్వమెర్పరచిన 3వ రొజు నుండి తెలుగుదేశం పార్టి కార్యకర్తల,రవన్న అనుచరుల హత్య లతొ అనంతపురం జిల్లా అట్టుడికిపొయింది.అప్పటినుంది పరిటాల రవన్న జీవితం ప్రమాదం లొ పడింది.ప్రభుత్వం పథకం ప్రకారం రవన్న రక్ష్ణ కి ఇవ్వవలసిన గన్ మెన్ లను తగ్గించివేసింది.ప్రభుత్వన్ని తన రక్షన గురించి అడిగితే చెవిటి వాడి ముందు శంఖం వూదినట్లైంది.రవన్న హైకొర్టు కి అప్పేలు చేసుకొంటె,హైకొర్టు ప్రభుత్వానికి రక్షణ ను పెంచమని ఆర్డర్లు పంపించింది.ఈ ప్రభుత్వం చేసేది లేక వయసు 45 పై బడిన 5గురు గన్ మెన్ లను ఇచ్చింది.రవన్నను తన సొంత సెక్యురిటి ని కూడ అనుమతించలేదు.6కార్ల కాన్వాయ్ ని 2కార్ల కు తగ్గించి వేసారు.కాన్వాయ్ ని తగ్గించటానికి ప్రభుత్వం చెప్పిన కారణం, రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంధి గా వుందని. ప్రతి 15 రొజులకు ఒక సారి అనంతపురం, వెంకటాపురం ఇళ్ళల్లొ సొదాలు జరిపించి మానసికంగా కుంగదీశారు.అదే సమయంలొ సూరి గ్యాంగ్ పరిటాల రవి సన్నిహితుడు కార్పొరేటర్ అయిన భాషా ను జూన్ 2004 లొ ధర్మవరం లొ చంపేసారు. మరో సన్నిహితుడు, సొమందేపల్లి ZPTC Member అయిన ఆది నారాయణ ను చంపేసారు.ఆ తర్వాత తగరకుంట ప్రభాకర్ ని, బళ్ళారి లొ R.K ని సూరి అనుచరులు జూలకంటి శ్రీనివాసరెడ్డి(మొద్దు శీను),దామొదరరెడ్డి,భాస్కరరెడ్డి కలిసి చంపేసారు. సొమందేపల్లి ఉప ఎన్నికలకు రవన్న వస్తే చంపెందుకు పథకం పన్నారు.అనంతపురం DSP నరశిమ్హరెడ్డి సాయముతొ రవన్న ముఖ్య అనుచరులైన పావురాల క్రిష్ణ అతని సోదరుడిని చంపేసారు.వై యస్ జగన్ తనను చంపటానికి జైలు లొ వున్న సూరి తొ కలిసి కుట్ర పన్నుతున్నాడని కేసు పెట్టాడు రవన్న.అప్పట్లొ సూరి కి ఎవరితొ మాట్లాడాలన్న, సెల్ ఫొన్లు అవసరం వచ్చినా,ఎవరినన్నా కలవాలన్నా జైలు అధికారులు బాగా సహకరించేవారు.తనపై కేసు పెట్టి తనకు పరువు నష్టం కలిగించాడని తిరిగి రవన్న పై పులివెందుల కొర్టు లొ వై యస్ జగన్ కేసు పెట్టాడు.అప్పుడు పులివెందుల కొర్టు కి హాజరు అవుతున్న రవన్న కాన్వాయ్ ని పొలీసులు అడుగడుగునా తనిఖీ చెసి చివరికి 2 కార్లను మాత్రమే పులివెందులకు ప్రవేశం కల్పించారు.అనంతరం 2005 జనవరి 24న అనతపురం లొని తెలుగుదేశం పార్టి ఆవరణలొ సూరి అనుచరుల తూటాలకు బలయ్యాడు.ఈ భీతావాహ సంఘటనతొ రవన్న అభిమానులు, తెలుగుదేశం పార్టి కార్యకర్తలు తమ నాయకుడి ని కొల్పొయిన దుఖం తొ ఆవెశం లొ 60 కొట్ల నష్టాన్ని ప్రభుత్వనికి కలగచేసారు.కాంగ్రెస్స్ పార్టి సానుభూతిపరులు, తెలుగుదేశం పార్టి వ్యతిరేకులు "ఒక ఫాక్షన్ నాయకుడు చనిపొతే ఇంత నష్టమా" అని విమర్శించారు.ఇదే జనం ఇందిరాగాంధి చనిపొయినప్పుడు న్యు డిల్లీ లొ 3400 మంది సిక్కు మతస్తులను వూచకొత కొసారు.విజయవాడ లొ ఒక రౌడి షీటరు గా వుండి కాంగ్రెస్స్ ప్రతినిధిగా వున్న వంగవీటి మొహన రంగా చనిపొతే ఆ రొజుల్లొ 500 కొట్ల నష్టంతొ 5 రొజులు విజయవాడ అగ్నికీలల్లొ వుంచారు.ఎంతొ మంది ధన మాన ప్రాణాలను కొల్పొయారు.అప్పట్లొ విజయవాడ లొ ఈ దాడులు దగ్గిరుండి కేంద్రమంత్రి పి.శివసంకర్ జరిపించాదని బెజవాడ ప్రజలు అనుకొంటారు.అతని చిన్న కొడుకే ఇప్పుదు కొత్త పార్టి లొ కీలక భాద్యత వహిస్తున్న వినయ్ కుమార్.రవన్న చనిపొయిన తరువాత తెలుగుదేశం కార్యకర్తల పై జరిగిన దాడులు, హత్యలు, వేధింపులు,పొలీసు కేసులు మనకి తెలిసినవే.
రవన్న పెనుగొండ నియొజక వర్గ ప్రతినిధిగా వున్నప్పుడు చేసిన అభివ్రుద్ది:
  • రవన్న కుటుంబం నుంచి ఈ రొజుకి కూడా పెనుగొండ నియొజక వర్గము లొని నసనకొట పంచయతి పరిధిలొని 9 గ్రామాలలొని పెద బడుగు బలహీన వర్గాల ప్రజలకి బియ్యం,గొధుమలు,బార్లి పంపిస్తారు.ఈ రొజుకి కూడా రవన్న కుటుంబం మీద ఆ గ్రామాల ప్రజలు ఆధారపడ్డారు.
  • అనంతపురం జిల్లా కరువు రక్కసిలొ చిక్కుకున్న పేద రైతుల పిల్లలకు ఒక సారి 360, ఇంకొసారి 1,116 వివాహాలు తన ఖర్చు తొ జరిపించిన గొప్ప త్యాగశీలుడు.
  • నసనకొట పంచాయతి పరిధి లొ పాడుబడిన వెంకటేశ్వర దేవాలయాన్ని పునరుద్దరించిన గొప్ప దైవికుడు.4 కొట్ల రూపాయల తన సొంత ఖర్చుతొ ఈ దేవాలయాన్ని,రొడ్ల మరమ్మత్తు లని, కమ్యునిటి హాల్స్ ని ఎర్పరిచాడు.
  • 14 కొట్ల(11 కొట్లు తెలుగుదేశం ప్రభుత్వము ఇవ్వగా తన చెతి నుంచి 3కొట్ల రూపాయలు) రూపాయల ఖర్చుతొ తాగు నీటి సౌకర్యం ఎర్పాటు చేసిన మహనీయుడు రవన్న.
  • రొద్దం మండలం లొ తెలుగుదేశం ప్రభుత్వ సాయంతొ ప్రభుత్వ జునియర్ కళాశాల ను ఏర్పాటు చేసాడు.
  • అంతే కాకుండా ప్రభుత్వానికి సిఫారసు చేసి 4 గ్రామాలలొ ప్రాధమిక ఆరొగ్య కేంద్రాలను ఏర్పాటు చేయించాడు.
  • ప్రభుత్వం పై వత్తిడి తీసుకువచ్చి రొద్దం లొ M.R.O కార్యాలయాన్ని ఏర్పాటు చేయించిన మహనీయుడు రవన్న.
  • చుట్టు ప్రక్కల గ్రామాల లొని అన్ని రొడ్ల ను మెయిన్ రొడ్లతొ అనుసంధానించాడు.
  • మరెన్నొ ఇతర అభివ్రుద్ది కార్యక్రమాలు రవన్న చేతుల మీదుగా జరిగాయి.
అనంతపురం జిల్లా మాజీ కలెక్టర్ శ్రీ.సొమెష్ కుమార్ గారు 1990 లొ తను ట్రైనింగ్ లొ వుండగా చూసిన పెనుగొండ నియొజక వర్గాన్ని ఇప్పటి అభివ్రుద్ది చెందిన అదే పెనుగొండ నియొజక వర్గాన్ని చూసి,ఈ 10 సంవత్సరాలలొ ఇంతటి అభివ్రుద్ది ఒక్క రవన్న కె సాద్య పడిందని ఎంతొ కొనియాడారు.
పేద ప్రజల అభివ్రుద్దికి, మనుగడకు ఇటువంటి మహనీయులు ఈ సమాజానికి ఎంతైనా అవసరం వుంది.

రవన్న లేని లొటు అనంతపురం జిల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి కడుపు కొతనే మిగిల్చింది,అభిమానులకు కన్నీళ్ళు మిగిల్చింది.

జొహార్ పరిటాల రవన్న.

Sunday, October 19, 2008

పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- 2



రవన్న తన తండ్రి,అన్నయ్య ల హత్యలకి బదులు తీర్చుకొవాలనుకొని 1991లొ నక్సలైట్ల సహాయం కోరతాడు.నక్సలైట్లు కూడ తమ నాయకులను(శ్రీరాములు,హరన్న)లను పొగుట్టుకున్నందుకు ప్రతీకారం తీర్చుకొవలునుకొంటారు.ఆ ప్రయత్నాలలొ భాగం గానే, 1991 లొ సానే చెన్నారెడ్డి ధర్మవరం లొని తన ఇంట్లొ కుర్చీ లొ కూర్చుని పేపర్ చదువుతుండగా నక్సలైట్లు పొలీసు దుస్తుల్లొ వచ్చి చంపి వెళ్ళిపొతారు.తిరిగి కాంగ్రెస్సు రమణారెడ్డి(సానే చిన్నారెడ్డి పెద్ద కొదుకు) కి టిక్కెట్ ఇచ్చి భారీ రిగ్గింగులతో గెలిపిస్తుంది.ఆ ఎలక్షన్స్ లొ ఒబుల రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి అరాచకాలు ధర్మవరం లొ మిన్నంటాయి.


అప్పట్లొ నక్సలైట్ల(P.W.G) లొ చీలికలు వచ్చాయి. దాని తరువాత గంగుల సూర్యనారాయణ రెడ్డి ఇంట్లొ నక్సలైట్లు T.V లొ బాంబు అమర్చి అతన్ని సొదరులను చంపుతారు. ఈ దాడిలొ ప్రముఖుడుగా నక్సలైట్ల లో ఒక విభజన వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న పొతుల సురేష్ ఫాల్పడ్డడని అనుకొంటారు.ఈ గ్రూప్ పేరు Re-Organising Comittee(ROC).రెండో వర్గమైన Red Star కి సుదర్శన్ నాయకత్వం వహిస్తుంటాడు.అప్పటి నుంచి ROC రవన్న కి తోడుగా నిలిస్తె, Red Star గంగుల సంతానానికి సహాయము చేస్తూ వచ్చింది.ఈ రెండు గ్రూపుల పొరాటాల మధ్య షుమారు 40 మంది మ్రుత్యువాత పడ్డారు.R.O.C పెట్టిన T.V బాంబు పెలుదులొ గంగుల సూర్యనారాయణ రెడ్డి తప్పించుకున్నాడు.తర్వాత కొన్నాళ్ళు కర్నాటక లొ తల దాచుకొన్నాడు.అక్కదే భానుమతి తొ వివాహము జరింగింది.రాజకీయాలతొ పీడిత బడుగు బలహీన వర్గాలకి ప్రయోజనం చేకూర్చాలని జన జీవన స్రవంతి లొ అడుగు పెడతాడు రవన్న.తెలుగుదేశం పార్టి తరపున 1993 ఎలక్షన్లలొ పెనుకొండ నియొజక వర్గానికి రమణారెడ్డి పై ఎటువంటి హింసా లెకుండా అత్యదిక మెజారిటి తొ గెలిచాడు.1994 లొ తనకు ఇష్టమైన కార్మిక శాఖా మంత్రిగా పని చేసాడు.తర్వాతి కాలములొ లక్ష్మి పార్వతి అనంతపురం జిల్లా రాజకీయాల పై మితిమీరిన జొక్యం కారణంగా కొణ్ణాళ్ళు తెలుగుదేశం పార్తి కి దూరంగా వున్నాడు.1995 లొ అన్నగారు (NTR), తిరిగి రవన్న కే పెనుకొండ Ticket ఇచ్చారు.అప్పుడూ పెనుకొండ నియొజక వర్గ ప్రజలు రవన్న కే పట్టం కట్టారు.అప్పుడూ ప్రత్యర్థి రమణారెడ్డే.1996 లొ నందమూరి తారక రామారావు గారు చనిపొయారు.రవన్న ఆ సమయములొ NTR తెలుగుదేశం పార్టి కి రాజీనామా చేసి తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వాన అదే రమణా రెడ్డి పై మరలా విజయ దుందుభి మోగించాడు.


1996 లొ ROC, ఒబుల రెడ్డి అరాచకాలకు ఒక ముగింపు నివ్వాలన్న వుద్దెశ్యముతొ అతని కొసం వెదుకులాట సాగిస్తుంది.ఒబులరెడ్డి Hyderabad నగరములొ వున్నట్టు సమాచారం అందుకొని అతన్ని Hyderabad లొని ఒక అపార్ట్మెంట్ లో వ్యభిచారం చేస్తుండగా పట్టుకొంటారు.ఆ వేశ్య ను బయటకు పంపించి వేసి అతని నలుగురు అనుచరులను చంపుతారు. ఒబుల రెడ్డి ని మాత్రం రోడ్డు మీదకు తీసుకు వచ్చి అతని గొంతు ని, లింగాన్ని కొసి పారిపొతారు.



పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- Video 1






పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- Video 2







పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- Video 3