Tuesday, November 18, 2008

Yuvagarjana Sambaraalu-Abhimanula Kerinthalu

విశ్వ విఖ్యాత నట తేజోరూపం నందమూరి బాలక్రిష్ణ(మా బాలయ్య బాబు) గారి ఆగమనం ఆసన్నమౌతుంది.డిసెంబరు మూడవ వారంలో జన వేదికలపై సత్తా చాటటానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.తెలుగుదేశం కార్యకర్తలారా!రాబొయ్యె అనందకరమైన భవిష్యత్తుకై 5 నెలలు కష్టపడండి.ఫలితాన్ని అనుభవించండి.అతి ముఖ్యమైన సంగతి ఏమిటంటే-TRS, తెలుగుదేశం తో పొత్తు పెట్టుకోదు.ప్రత్యెక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పాటుకు తెలుగుదేశం సిద్దమే. TRS రాజకీయ నాటకాలు చంద్రబాబు దగ్గిర సాగవని KCR కి తెలుసు.

తెలుగుదేశం పార్టి ని అధికారంలోకి తీసుకు రాకపొతే తిరిగి వెనకబాటు తనానికి గురవుతామని పేద,బడుగు,బలహీన,అట్టడుగు వర్గాల వారికి అర్థం అయ్యింది.కొత్త పార్టి తో BC ల రిజర్వేషన్ లో పలు మార్పులు సంభవిస్తాయని(గత కొన్నేళ్ళుగా కాపు,బలిజ,తెలగ కులాలని BC లలో చేర్చాలని ఆయా కుల నాయకులు అందొళనలు చెసారు. ), ఇప్పుడు వున్న BC ల అభివ్రుద్ది ఆవిరి అవుతుందని తెలిసి వారంతా తెలుగుదేశం పార్టి తోనే వెన్నంటి వున్నారు.

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టి విజయ దుందుభి మ్రోగించుట ఖాయం.

ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ది పథం లో పయనించుట తద్యం.

స్వర్ణాంధ్ర సాదించుటే తెలుగుదేశం పార్టి ధ్యేయం.