
అధికారంలోకి రాగానే లక్షలాది ఉద్యొగాలు ఇస్తానన్న రాజశేఖరరెడ్డి అందలం ఎక్కగానే అన్ని హామీలను తుంగలో తొక్కారు.ముఖ్యమంత్రిగా గత నలుగున్నరేళ్ళలొ పోష్టింగుల కన్న ఊష్టింగులే ఎక్కువ చేసారు.ఉద్యొగం లేక, ఊపాధి లేక యువత భవితను రొడ్డు కీడ్చారు. ప్రభుత్వ శాఖల్లొ లక్షలాది ఖాళీలు వున్నా....భర్తీ చేసిన పాపాన పొలేదు.అందుకే ఈ దగాకొరు, బడా చోరు ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు "తెలుగు యువత" ఉద్యమించింది, సమర సిం హం లా,ఉగ్ర నరసిం హులై....ఉక్కు పిడికిలి బిగించింది.అధికార పక్ష గుండెల్లొ అలజడి ని స్రుష్టిస్తు, తెలుగుదేశం పార్టి గుంటూరులో ప్రతిష్టాత్మకంగా "యువ గర్జన" ను నవంబర్ 5వ తేదీన నిర్వహిస్తుంది.చరిత్రను తిరగరాసే ఈ యువగర్జన కు నందమూరి వారసులు...చైతన్య రథ సారధి హరిక్రిష్ణ, డైలాగ్ డైనమైట్ విశ్వ విఖ్యాత నట తేజో రూపం బాలయ్య , ఇంకా కల్యాణ్ రాం,తారక రత్న లు హాజరు కానున్నారు.