Sunday, October 19, 2008

పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- 2



రవన్న తన తండ్రి,అన్నయ్య ల హత్యలకి బదులు తీర్చుకొవాలనుకొని 1991లొ నక్సలైట్ల సహాయం కోరతాడు.నక్సలైట్లు కూడ తమ నాయకులను(శ్రీరాములు,హరన్న)లను పొగుట్టుకున్నందుకు ప్రతీకారం తీర్చుకొవలునుకొంటారు.ఆ ప్రయత్నాలలొ భాగం గానే, 1991 లొ సానే చెన్నారెడ్డి ధర్మవరం లొని తన ఇంట్లొ కుర్చీ లొ కూర్చుని పేపర్ చదువుతుండగా నక్సలైట్లు పొలీసు దుస్తుల్లొ వచ్చి చంపి వెళ్ళిపొతారు.తిరిగి కాంగ్రెస్సు రమణారెడ్డి(సానే చిన్నారెడ్డి పెద్ద కొదుకు) కి టిక్కెట్ ఇచ్చి భారీ రిగ్గింగులతో గెలిపిస్తుంది.ఆ ఎలక్షన్స్ లొ ఒబుల రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి అరాచకాలు ధర్మవరం లొ మిన్నంటాయి.


అప్పట్లొ నక్సలైట్ల(P.W.G) లొ చీలికలు వచ్చాయి. దాని తరువాత గంగుల సూర్యనారాయణ రెడ్డి ఇంట్లొ నక్సలైట్లు T.V లొ బాంబు అమర్చి అతన్ని సొదరులను చంపుతారు. ఈ దాడిలొ ప్రముఖుడుగా నక్సలైట్ల లో ఒక విభజన వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న పొతుల సురేష్ ఫాల్పడ్డడని అనుకొంటారు.ఈ గ్రూప్ పేరు Re-Organising Comittee(ROC).రెండో వర్గమైన Red Star కి సుదర్శన్ నాయకత్వం వహిస్తుంటాడు.అప్పటి నుంచి ROC రవన్న కి తోడుగా నిలిస్తె, Red Star గంగుల సంతానానికి సహాయము చేస్తూ వచ్చింది.ఈ రెండు గ్రూపుల పొరాటాల మధ్య షుమారు 40 మంది మ్రుత్యువాత పడ్డారు.R.O.C పెట్టిన T.V బాంబు పెలుదులొ గంగుల సూర్యనారాయణ రెడ్డి తప్పించుకున్నాడు.తర్వాత కొన్నాళ్ళు కర్నాటక లొ తల దాచుకొన్నాడు.అక్కదే భానుమతి తొ వివాహము జరింగింది.రాజకీయాలతొ పీడిత బడుగు బలహీన వర్గాలకి ప్రయోజనం చేకూర్చాలని జన జీవన స్రవంతి లొ అడుగు పెడతాడు రవన్న.తెలుగుదేశం పార్టి తరపున 1993 ఎలక్షన్లలొ పెనుకొండ నియొజక వర్గానికి రమణారెడ్డి పై ఎటువంటి హింసా లెకుండా అత్యదిక మెజారిటి తొ గెలిచాడు.1994 లొ తనకు ఇష్టమైన కార్మిక శాఖా మంత్రిగా పని చేసాడు.తర్వాతి కాలములొ లక్ష్మి పార్వతి అనంతపురం జిల్లా రాజకీయాల పై మితిమీరిన జొక్యం కారణంగా కొణ్ణాళ్ళు తెలుగుదేశం పార్తి కి దూరంగా వున్నాడు.1995 లొ అన్నగారు (NTR), తిరిగి రవన్న కే పెనుకొండ Ticket ఇచ్చారు.అప్పుడూ పెనుకొండ నియొజక వర్గ ప్రజలు రవన్న కే పట్టం కట్టారు.అప్పుడూ ప్రత్యర్థి రమణారెడ్డే.1996 లొ నందమూరి తారక రామారావు గారు చనిపొయారు.రవన్న ఆ సమయములొ NTR తెలుగుదేశం పార్టి కి రాజీనామా చేసి తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వాన అదే రమణా రెడ్డి పై మరలా విజయ దుందుభి మోగించాడు.


1996 లొ ROC, ఒబుల రెడ్డి అరాచకాలకు ఒక ముగింపు నివ్వాలన్న వుద్దెశ్యముతొ అతని కొసం వెదుకులాట సాగిస్తుంది.ఒబులరెడ్డి Hyderabad నగరములొ వున్నట్టు సమాచారం అందుకొని అతన్ని Hyderabad లొని ఒక అపార్ట్మెంట్ లో వ్యభిచారం చేస్తుండగా పట్టుకొంటారు.ఆ వేశ్య ను బయటకు పంపించి వేసి అతని నలుగురు అనుచరులను చంపుతారు. ఒబుల రెడ్డి ని మాత్రం రోడ్డు మీదకు తీసుకు వచ్చి అతని గొంతు ని, లింగాన్ని కొసి పారిపొతారు.



పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- Video 1






పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- Video 2







పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న- Video 3